Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ సీఎం కేసీఆర్ తలుచుకుంటే సమస్యల అంతు చూస్తారని గులాబీ నేతలు చెప్పుకుంటారు. వారి మాటలకు తగ్గట్లుగానే విద్యుత్ కోతల మయమైన రాష్ట్రాన్ని.. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చే దిశగా కేసీఆర్ తీసుకెళ్లారు. కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం కేసీఆర్ చొరవ మాటలకే పరిమిమైంది. హైదరాబాద్ ను వాల్డ్ క్లాస్ సిటీ చేస్తామని చెప్పి ఏడాదిన్నర గడిచినా.. ఇంతవరకూ అతీగతీ లేదు.
హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్త చక్కదిద్దడం అంత వీజీ కాదు. కానీ అసలు ప్రయత్నమే స్టార్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుగులేని అధికారం ఉంది. సమర్థులైన అధికారులున్నారు. కావల్సినంత డబ్బు ఉంది. అయినా జీహెచ్ఎంసీ పై సరిగ్గా దృష్టి పెట్టడం లేదు కేసీఆర్. ఈ విషయంలో మాత్రం జీహెచ్ఎంసీ వాసుల్ని ఆయన మోసం చేశారనే టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్ సంగతి కుమారుడు కేటీఆర్ కు వదిలేసిన కేసీఆర్.. ఆయన పనైపోయిందని చేతులు దులుపుకున్నారు. కేటీఆర్ ఏమో ట్వీట్లకు స్పందిస్తే చాలనుకుంటున్నారు. కేసీఆర్ పట్టించుకోరు. కేటీఆర్ ట్విట్టర్ వదలరు. ఇక హైదరాబాద్ ఎలా బాగుపడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గత పాలకుల హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాల్ని గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. తాము అధికారంలో ఉన్నప్పుడే జరిగిన అక్రమాలపై మాత్రం నోరు మెదపడం లేదు.