పవన్ ని వెయిట్ చేయించిన కెసిఆర్?

why-pawan-kalyan-left-wedding-ceremony-of-ntv-chairman

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీలు సైతం గొప్పగా చెప్పుకునేంత గ్రాండ్ గా జరిగిన పెళ్లిళ్లలో ఎన్ టీవీ చౌదరి కుమార్తె పెళ్లి ఒకటి. ఆ పెళ్ళికి తెలుగు రాష్ట్రాలకి చెందిన ప్రముఖులంతా వచ్చారు. మరీ ముఖ్యంగా రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్ళు ఆ పెళ్ళిలో స్పెషల్ అట్ట్రాక్షన్ గా నిలిచారు. అలా రావడమే ఓ చిన్న సమస్యకి కూడా కారణం అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎదురైన ఓ అనుభవం తట్టుకోలేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లి నుంచి వడివడిగా వెనక్కి వెళ్ళిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ పెళ్ళికి హాజరైన కొందరు చెబుతున్న మాటల ప్రకారం..

చౌదరి కుమార్తె పెళ్ళికి అతిరథమహారధులు ఎంత మంది వచ్చినప్పటికీ అతిధి మర్యాదలకి ఏ లోటు రాకుండా చూసుకున్నారు . అయితే పెళ్లి కుమార్తె, పెళ్ళికొడుకుని ఆశీర్వదించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు ఒకే సమయానికి వేదిక వద్దకు వెళ్లారు. దీంతో సహజంగానే వయసు, ప్రోటోకాల్, పదవి వీటి అన్నిటి రీత్యా కెసిఆర్ ముందుగా వధూవరులని ఆశీర్వదించడానికి వెళ్లారు. అక్కడ ఆశీర్వచనాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ మందిని పలకరిస్తూ ఎక్కువ సమయం గడిపారు. ఆయన అక్కడ ఉన్నంత సేపు పవన్ కళ్యాణ్ వెయిట్ చేయాల్సి వచ్చిందట. సినీ పరిశ్రమలో ఎక్కడికెళ్లినా టాప్ ప్రయారిటీ లభించే పవన్ కి ఈ పరిణామం ఇబ్బంది కలిగించిందట. అందుకే ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా వెళ్లిపోయారట. ఇది నిజమో, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కల్పించిందో తెలియదు గానీ మొత్తానికి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చిలవలుపలవలుగా చెప్పుకుంటున్న విషయం మాత్రం నిజం. అసలు నిజం ఏమిటో త్వరలోనే బయటికి రానుంది. అప్పటిదాకా ఈ విషయం శరవేగంతో ప్రయాణిస్తూనే ఉంటుంది.