Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ భేటీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు కేసీఆర్ గాలం వేస్తున్నారని ఆయన ఆరోపించారు. సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ తోపాటు ఆయన కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విశ్లేషించారు. పవన్ తో మంచిగా ఉంటే తెలంగాణలోని కాపుల ఓట్లు టీఆర్ ఎస్ కు పడతాయన్నది కేసీఆర్ ఆలోచన అని వీహెచ్ వ్యాఖ్యానించారు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఎవడా పవన్ కళ్యాణ్ అన్న కేసీఆర్, పవన్ తో భేటీ కావడం వెనక ఉద్దేశమిదేనన్నారు. పవన్ తో కేసీఆర్ సానుకూల వైఖరిని తాను ముందే ఊహించానన్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న కేసీఆర్ ను అభినందించేందుకే ఆయన్ను కలిశానని పవన్ చెప్పినప్పటికీ… వారి భేటీపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. తెలంగాణలో అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాలని కోరేందుకే పవన్ కేసీఆర్ ను కలిశారని కత్తి మహేశ్ లాంటి వారు ఆరోపించారు. అయితే ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో వారి భేటీ జరిగింది సినిమా కోసం కాదన్న వాదన వినపడుతోంది. కీలక రాజకీయ అంశాలపైనే కేసీఆర్, పవన్ చర్చించినట్టు తెలుస్తోంది.