తెలంగాణ కొత్త మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారెవరికీ కేసీఆర్ వద్దకు యాక్సెస్ లేనప్పటికీ కేటీఆర్‌కు తమ తమ విజ్ఞానపనలు చేసుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఇప్పటికే మంత్రివర్గంపై శాఖలపై కూడా ఓ క్లారిటీకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి అవకాశం లేదని సీనియర్లకు మాత్రమే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల్లో పదిహేను శాతం మందికే మంత్రివర్గంలో చోటు కల్పించాలి. ఆ ప్రకారం మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంది. కేసీఆర్‌ను మినహాయిస్తే పదిహేడు మందికి చాన్స్ ఉంటుంది. ఇప్పటికే మహమూద్ అలీ ప్రమాణం చేశారు కాబట్టి ఇక పదహారు మందికి అవకాశం ఉంది. మంత్రులయ్యేవారి జాబితా ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం
1) కేసీఆర్ – ముఖ్యమంత్రి
కడియం శ్రీ హరి -డిప్యూటీ సీఎం, విద్యా శాఖ
మహమూద్ అలీ -డిప్యూటీ సీఎం, హోం శాఖ
ఈటెల రాజేందర్ – ఫైనాన్స్
నిరంజన్ రెడ్డి – రెవెన్యూ
కేటీఆర్ -పంచాయతీ, ఐటీ
హరీష్ రావు – ఇరిగేషన్, అసెంబ్లీ వ్యవహారాలు
జగదీశ్వర్ రెడ్డి – పవర్
పువ్వాడ అజయ్ – రోడ్లు భవనాల శాఖ
కట్టి పద్మా రావు – రవాణా
తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఎకసైజ్
పోచారం శ్రీనివాస రెడ్డి – వ్యవసాయ
జాగు రామన్న- అటవీ శాఖ
కొప్పుల ఈశ్వర్ – సాంఘిక సంక్షేమ
దానం నాగేందర్ – పట్టణ అభివృద్ధి – మునిసిపల్
ఇంద్రకరణ్ రెడ్డి – దేవాదాయ
బాల్క సుమన్ – క్రీడా శాఖ
మల్లా రెడ్డి – వైద్య ఆరోగ్య శాఖ
ఇక మంత్రి పదవులు రాని వారికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులతో సంతృప్తి పరిచే అవకాశం ఉంది.