Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఓ దశలో తీవ్రంగా విమర్శించడం, అంతలోనే పొగడ్తల వర్షం కురిపించడం ఆయనకే సాధ్యమౌతుంది. ఏపీ, తెలంగాణ భవిష్యత్ సీనియర్ జర్నలిస్ట్ రామ్ తో ఆయన పంచుకున్న భావాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో జీఎస్టీ ఓ ప్రయోగమేనన్న కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
జీఎస్టీకి అందరి కంటే ముందు మద్దతు పలికిన కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టులపై పన్ను పెరిగే సరికి ప్లేటు ఫిరాయించారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఇక తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయానికి విరుగుడుగానే ఉద్యమం జరిగిందని, అందర్నీ సమానంగా చూసుంటే.. అసలు ఉద్యమమే వచ్చేది కాదన్నారు కేసీఆర్.
నీటి యుద్ధాలు కూడా భవిష్యత్తులో వస్తాయని, కానీ తెలుగు రాష్ట్రాలకు ఢోకా లేదని చెప్పారట కేసీఆర్. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. తాము ఇప్పటికే ఒకరికొరరు ఈ విషయంలో సహకరించుకుంటున్నామని, ఎక్కడ నీళ్లు అవసరమైతే అక్కడ వాడుతున్నామని కేసీఆర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అంత సుహృద్భావం అంటే ఇన్ని గొడవలు ఎందుకు వస్తాయని జనం అనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: