కేసీఆర్ కి వారంటే ఎంత ప్రేమో ?

KCR New Cabinet Opening Date And Time Fixed

ఇంటర్‌తో పాటు ఎంసెట్ తదితర పరీక్షల విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తోంది. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యం కాదు’ ఇదీ ఇరవై మంది ఇంటర్ పిల్లలు చనిపోతే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన స్పందన తెలియ చేసిన విధానం. అంతమంది చనిపోతే కనీసం సంతాపం తెలియచేసే సమయం లేదు. వారి నోళ్లు మూయించడానికి ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ప్రకటించారు. ఇదంతా బయట పిల్లలు చనిపోతేనే కాని తన మనవడికి జ్వరం వస్తే వెంటనే వాలిపోతడు. తాజాగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య (11) స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆర్యను బుధవారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చి మనవడిని పరామర్శించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు మనవడితో గడిపిన కేసీఆర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. ఎంతైనా సొంత రక్తం కదా ఆమాత్రం చేయోద్దా ?