Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలో ఉన్నంత కాలం మహానటి సావిత్రి గురించి గుర్తు పెట్టుకుటాం. తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సావిత్రి. మహానటి సావిత్రి జీవిత కథాంశంతో ‘మహానటి’ అనే చిత్రం తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయిన నేపథ్యంలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ చిత్ర యూనిట్ సభ్యులకు గిఫ్ట్లు ఇస్తూ సంతోష పెడుతోంది.
అప్పట్లో సావిత్రి హీరోయిన్గా నటించిన చిత్రాలు షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి చిత్ర యూనిట్ సభ్యులను సంతోష పెట్టేది. సావిత్రి దారిలోనే ఎంతో మంది సినీ వర్గాల వారు టెక్నీషియన్స్ మరియు కింది స్థాయి వర్కర్లకు బహుమానాలు ఇవ్వడం మొదలు పెట్టారు. సావిత్రి పాత్ర చేయడం వల్లో ఏమో కాని ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే పని చేసింది. తాజాగా మహానటి కోసం వర్క్ చేసిన పలువురికి బంగారు నాణాలను కీర్తి సురేష్ బహుమానంగా ఇవ్వడం జరిగింది.
గతంలో విజయ్ రెండు మూడు చిత్రాల షూటింగ్లు పూర్తి అయిన సందర్బంగా బహుమానాలు ఇచ్చాడు. మెర్సల్ చిత్రం పూర్తి అయిన తర్వాత బంగారు నాణెలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కీర్తి సురేష్ బంగారు నాణెలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహానటి చిత్రంతో తెలుగు మరియు తమిళంలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.