Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Keerthi Suresh Clarity About Mahanati Savitri Role
ఒక స్టార్ హీరో కూడా పాత్ర కోసం లావు అయ్యేందుకు ఎంతో ఆలోచిస్తాడు. ఆ తర్వాత జరుగబోతున్న పరిణామాలు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని లావు అవ్వాలా వద్దా అని ఆలోచించాల్సి ఉంటుంది. కాని అనుష్క మాత్రం ఒక సినిమా కోసం అమాంతం 20 కేజీలు పెరిగేసింది. తానో యోగా ట్రైనర్‌ను కనుక ఈజీగానే లావు తగ్గొచ్చు అని ఆమె భావించింది. కాని అనుకున్నట్లుగానే ఆ సినిమా కోసం భారీగా కష్టపడి పెరిగింది. కాని అనుష్క కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. నిరుత్సాహంతో అనుష్క మళ్లీ సన్నబడే ప్రయత్నం చేసింది. కాని కుదరడం లేదు. దాదాపు సంవత్సరంకు పైగా అనుష్క లావు తగ్గేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు అనుష్క చేసిన తప్పును కీర్తి సురేష్ చేసేందుకు ఓకే చెప్పలేదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేష్ చేస్తున్న విషయం తెల్సిందే. సావిత్రి కాస్త లావుగా ఉంటుంది. అందుకే దర్శకుడు కీర్తి సురేష్‌ను 10 కేజీల బరువు పెరగాల్సిందిగా కోరాడట. అందుకు కీర్తి సురేష్ నిర్మొహమాటంగా నో చెప్పిందట. లావు పెరగడం నా వల్ల కాదు, కాస్ట్యూమ్స్ లేదా మేకప్‌తో మేనేజ్ చేయండి. అంతే తప్ప లావు తాను కాను అంటూ చెప్పేసిందట. దాంతో దర్శకుడు కన్విన్స్ అయ్యి ఏదోటి చేద్దామని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్ లావు కాకుండానే షూటింగ్‌ను చేసేస్తున్నాడు. అనుష్క అనుభవంను దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో చేస్తున్న ఇతర సినిమాలను దృష్టిలో పెట్టుకుని కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వార్తలు