సమంత నటనపై కీర్తి సురేష్ స్పెషల్ కామెంట్స్!

Keerthy Suresh's special comments on Samantha's performance!
Keerthy Suresh's special comments on Samantha's performance!

అట్లీ దర్శకత్వం వహించిన తేరి మూవీ 2016లో విడుదలై మంచి స్పందనని అందుకుంది. స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ సరసన ఈ మూవీ లో సరసన సమంత నటించింది. ఈ సినిమా విజయం తర్వాత, అట్లీ గత సంవత్సరం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న అట్లీ తేరి ఈ సినిమా రీమేక్‌ చేశారు. నిర్మాతగా మారి బాలీవుడ్ లో మూవీ రూపొందించారు అట్లీ. ఈ సినిమా కి ప్రముఖ హిందీ దర్శకుడు ఖలీస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో నటుడు విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ అలాగే సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించారు.

Keerthy Suresh's special comments on Samantha's performance!
Keerthy Suresh’s special comments on Samantha’s performance!

ఈ సినిమా ద్వారా అందాల భామ కీర్తి సురేష్ హిందీ చిత్రసీమలో హీరోయిన్ గా పరిచయం అవుతుండటం గమనార్హం.ఈ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకుంది కీర్తిసురేష్. తాజాగా ఒక ప్రమోషన్ కార్యక్రమంలో సమంత గురించి కీర్తిసురేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి . ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ”ఈ బేబీ జాన్ మూవీ కథను హిందీ అభిమానులకు అనుగుణంగా మార్చారు, తమిళ తేరి సినిమాలో సమంత తన నటనను చాలా అందంగా చూపించింది అని చెప్పుకొచ్చింది కీర్తి.