ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి.. కేరళ మంత్రి

kerala minister praises on prabhas

కేరళలో భారీ వరదల కారణంగా ప్రజా జీవితం అస్థవ్యస్థం అయిన విషయం తెల్సిందే. ప్రజా రవాణ మరియు వ్యవసాయం ఇలా అన్ని రకాలుగా కేరళ నష్టపోయింది. వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం కేరళ బాగు పడేందుకు కావాల్సి ఉంది. కేంద్ర నుండి నిధులు పెద్దగా రాకపోవడంతో పాటు, విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే కేరళ సీఏం విజయన్‌ విరాళాలను ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. సీఎం పిలుపు మేరకు ఎవరికి తోచిన మొత్తంలో వారు ఇచ్చారు. సినిమా స్టార్స్‌ విరాళాలు ఎంత ఇచ్చారు అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. సౌత్‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో లారెన్స్‌ మాత్రమే కోటి రూపయలు ఇచ్చాడని, మిగిలిన వారు అంతా కూడా తక్కువ మొత్తంలోనే ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతుంది.

prabhas

తాజాగా కేరళ మంత్రి సుందరేశన్‌ విరాళాల విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. మలయాళ స్టార్‌ హీరోలు ఒకొక్కరు సినిమాకు నాలుగు అయిదు కోట్లు తీసుకుంటారు. కాని విరాళం విషయంలో మాత్రం చాలా పిసినారితనంను చూపించారు. వారి పిసినారితనంతో కేవలం లక్షల్లో కూడా సాయం చేయలేదు. అయితే కేరళలో పెద్దగా మార్కెట్‌ లేని తెలుగు హీరో ప్రభాస్‌ మాత్రం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు అంటూ మంత్రి పేర్కొన్నాడు. ప్రభాస్‌ను చూసి ఇతర సినీ ప్రముఖులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఈసందర్బంగా ఆయన అన్నాడు. అయితే ప్రభాస్‌ కోటి విరాళం విషయంలో క్లారిటీ ఇప్పటి వరకు లేదు. స్వయంగా మంత్రి ప్రకటించిన కారణంగా తమ అభిమాన హీరో కోటి ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

prabhas