సీనియర్ హీరోయిన్ గా తెలుగు లో దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ నటించి మంచి అనుభవాన్ని సంపాదించేసుకున్నది. అయితే వయసు మీద పడుతున్నప్పటికీ తన అందంలో మాత్రం ఎటువంటి మార్పురావడం లేదంట . కానీ త్రిషకు పెళ్లి ఎందుకో కలిసి రావట్లేదు … గతంలో తమిళ పారిశ్రామిక వేత్త మణియన్ ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోగా, ఆ తర్వాత వివిధ కారణాలతో పెళ్లి పీటలు ఎక్కకుండానే రద్దు అయిపోయింది . ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మాటకు పోలేదు త్రిష. ఇంతకాలానికి మళ్ళీ త్రిష మనసులో పెళ్ళయి ఆశలు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె కేరళ లోని మళయాళ సినిమా పరిశ్రమకు చెందిన ఒక నిర్మాతను పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారంట .
అయితే ఇప్పటి వరకు కేవలం మాటల వరకే పరిమితం అయిందట. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని వినికిడి. కనీసం ఈసారైనా త్రిష పెళ్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుందని ఆశిద్దాం.