దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు

దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు

ఈనెల 26 నుంచి స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు జరిగాయి. రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమా, సీనియర్లు ఎయిడెన్‌ మార్క్రమ్‌, క్వింటన్‌ డికాక్‌, వాన్‌ డర్‌ డస్సెన్‌, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జేలకు విశ్రాంతి కల్పించిన క్రికెట్‌ సౌతాఫ్రికా.. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌, వైస్‌ కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌కు పగ్గాలు అప్పజెప్పింది.

వర్క్‌ లోడ్‌, కఠిన బయోబబుల్‌ నిబంధనల కారణంగా సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు సీఎస్‌ఏ పేర్కొంది. సీనియర్లంతా డిసెంబర్‌లో టీమిండియాతో ప్రారంభమయే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బోర్డు తెలిపింది. వెటరన్‌ ఆటగాడు వేన్‌ పార్నెల్‌ సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కేశవ్‌ మహారాజ్‌, డారిన్‌ డుపావిల్లోన్‌, జేబేర్‌ హమ్జా, రీజా హెండ్రిక్స్‌, సిసండా మగాల, జన్నెమాన్‌ మలాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, వేన్‌ పార్నెల్‌, అండైల్‌ ఫెలుక్వాయో, డ్వెయిన్‌ ప్రిటోరియస్‌, రియాన్‌ రికెల్టంన్‌, తబ్రేజ్‌ షంషి, కైల్‌ వెర్రిన్‌, లిజాడ్‌ విలియమ్స్‌, ఖాయా జోండో