కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రభుత్వం అనూహ్య ప్రకటన చేసింది. పార్లమెంట్ అమృత్ సల్ స్పెషల్ సెషన్ సెప్టెంబర్ లో ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ చూసి గురువారం తెలిపారు.
ఈ సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్న అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా అనే కోణం కూడా వినిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవల ముగిసిన విషయము తెలిసిందే.
మోడీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది ఈ క్రమంలో మణుపూర్ ఘటనపై స్పందించాలని మోడీని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో అక్కడ శాంతి నెలకు బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అంటూ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల నేతలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పారు.