ఖైదీ నెంబర్ 150 కన్నా బ్రహ్మోత్సవం బెటర్.

http://telugubullet.com/wp-content/uploads/2017/06/bramhostsavam-and-khadi-no-150.jpg

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Khaidhi Number 150 More Than Better Brahmostsavam

మెగా స్టార్ చిరంజీవికి రాజకీయాలు అచ్చి రాకపోయినా రీఎంట్రీ లో కూడా సినిమా రంగం బ్రహ్మరధం పట్టింది.అందుకే ఖైదీ నెంబర్ 150 తేలిగ్గా 100 కోట్ల కలెక్షన్ సాధించింది.కానీ అక్కడికి వెళ్లేసరికి అంతా తల్లకిందులైంది.అదే ఒకప్పుడు మెగా స్టార్ పెట్టుబడికి భారీ రాబడులు కురిపించిన మా టీవీ. అదెప్పుడు స్టార్ కిందకి వెళ్లిందో అప్పటినుంచి అందులో చిరు వేలు పెట్టిన కార్యక్రమం ఏదీ పెద్దగా సక్సెస్ కాలేదు.నాగార్జున స్థానంలో చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తే జనం దాన్ని పెద్దగా ఆదరించలేదు. ఎన్నో అంచనాలతో బుల్లితెరపై కనిపించిన మెగా స్టార్ అక్కడ తన ముద్ర చూపించలేకపోయారు. ఇక తాజాగా ఇంకో పరాభవం చిరుకి ఎదురైంది.వెండితెరపై చిరు స్టార్ డమ్ కి అద్దం పట్టిన ఖైదీ నెంబర్ 150 బుల్లితెర మీదకి వచ్చేసరికి బొక్కబోర్లా పడింది.

మే 28 న మా స్టార్ టీవీ లో ఖైదీ నెంబర్ 150 ప్రసారమైంది.దాదాపు 19 కోట్లు పోసికొన్న ఈ సినిమా trp రేటింగ్ 6 .9 మాత్రమే రావడంతో స్టార్ టీవీ యాజమాన్యం నివ్వెరపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య చేసిన అన్ని సినిమాల్లోకి భారీ డిజాస్టర్ బ్రహ్మోత్సవం.ఆ సినిమా కూడా 7 .5 trp సాధించింది.దానికన్నా చిరు ఖైదీ నెంబర్ 150 తక్కువ రేటింగ్ ఎందుకు వచ్చిందో అర్ధం కాక ఇటు టీవీ ఇండస్ట్రీ దిగ్గజాలు,అటు ఫిలిం ఇండస్ట్రీ వస్తాద్ లు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు: