‘ఖుషి’ రిలీజ్…విజయ్ దేవరకొండ ఎమోషనల్ మాటలు..!

‘ఖుషి’ రిలీజ్...విజయ్ దేవరకొండ ఎమోషనల్ మాటలు..!
Latest News

‘ఖుషి’ చిత్రం ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది . ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు. ఐదేళ్లుగా ఎదురుచూపుల పట్ల భావోద్వేగం అయ్యారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది.

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన మూవీ ‘ఖుషి’. బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ గా ఈ రోజు (సెప్టెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది . పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. ఇప్పటికే రివ్యూస్ కూడా ప్రారంభమయ్యాయి..మూవీ పై ఆడియెన్స్, ఫ్యాన్స్ ఖుషి అయినట్టు కూడా తెలుస్తోంది. సామాజిక మాధ్యామాల్లో మూవీ పై వస్తున్న అభిప్రాయాలతో సినిమా మెప్పించిందని తెలుస్తోంది.

‘ఖుషి’ రిలీజ్...విజయ్ దేవరకొండ ఎమోషనల్ మాటలు..!
Vijay Devarakonda

ఆ తర్వాత సినిమా విజయ్ దేవరకొండకు ఏ స్థాయిలో విజయం అందించిందనేది తేలబోతోంది. అయితే ఖుషి రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ బాగా ఎమోషనల్ అయ్యారు. వరుస ఫ్లాప్స్ ను అందుకుంటున్న వస్తున్న రౌడీ హీరో ఈ సినిమా పై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. ఆ మేరకు తన మార్క్ లో ప్రమోషన్స్ కూడా చేసేసాడు . ప్రస్తుతం సినిమా థియేటర్లలో చేరింది. దీంతో విజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

నిన్న యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డ సందర్భంగా విజయ్ తొలుత ఒక వీడియోను విడుదల చేశాడు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న విజయ్ ఎమోషనల్ గా మాట్లాడారంట . ‘ఖుషి విడుదల అయింది . ఇప్పుడే రిలీజ్ దాకా వచ్చామంటే నమ్మలేకపోతున్నాను. మీరు నన్ను వెండితెరపై చూసి ఏడాది గడిచింది. మళ్లీ ‘ఖుషి’తో వస్తున్నాం. మీరందరూ మూవీ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఎంత వేచి ఉన్నానో మాటల్లో చెప్పలేకపోయాను . అంటూ యూఎస్ ప్రీమియర్స్ ముందు తన ఫీలింగ్ ను బయటపెట్టేసాడు .

ఇక తాజాగా… మరో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మీరందరూ నాతో పాటు 5 ఏళ్లు వేచి ఉన్నారు. నేను చేయాల్సి చేస్తానని ఓపికగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ‘ఖుషి’తో అది మేం చేశాం. నాకు దగ్గరగా ఉన్నవాళ్లు హ్యాపీగా నన్ను నిద్రలేపారు. అలాగే కొన్ని వందల మెసేజ్ లు నా ఫోన్‌కు కూడా వచ్చాయి. ఈ క్షణంలో నేను భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేను. నేను మీ అందరి పట్ల ప్రేమతో ఉన్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ‘ఖుషి’కి వెళ్లి ఆనందించండి. ప్రేమతో మీ విజయ్ దేవరకొండ’ అని అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కు ‘ఖుషి’తో మంచి రిజల్ట్ అందిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పూర్తిస్థాయిలో రివ్యూలు, రిజల్ట్ బయటికి రావాల్సి ఉంది. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించేశారు . హేషమ్ అబ్దుల్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం మూవీ విషయానికొస్తే.. బ్రహ్మిణ కుటుంబంలోని ఆరాధ్య, క్రిస్టియన్ అయిన విప్లవ్ ను కాశ్మీర్ లో సమంత బేగంగా కలుస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది . ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకొని తాము బెస్ట్ కపుల్ అని కూడా నిరూపించాలనుకుంటారు. ఆ తర్వాత ఏం చేశారనేది సినిమా. సమంత, విజయ్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మ్యూజిక్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయని తెలుస్తోంది.