రెండవ దానికే కోటీశ్వరురాలైంది

Kiara Advani's second Movie remuneration in 1 Cr for Charan Movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బాలీవుడ్‌ నుండి మహేష్‌ ‘భరత్‌ అను నేను’ చిత్రం కోసం దిగుమతి అయిన ముద్దుగుమ్మ కైరా అద్వానీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మొదటి సినిమానే మహేష్‌బాబుతో చేయడంతో ఈ అమ్మడి పంట పండినట్లయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘భరత్‌ అను నేను’ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం వల్ల కైరా అద్వానీకి పలువురు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. మహేష్‌తో మొదటి సినిమాలో నటించేందుకు 50 లక్షల పారితోషికం అందుకున్న కైరా అద్వానీ తన రెండవ సినిమాకు ఏకంగా కోటి రూపాయల పారితోషికంను అందుకోబోతుంది.

కైరా అద్వానీ రెండవ చిత్రం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అనే విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ మూవీలో కైరా అద్వానీ నటించేందుకు గాను ఏకంగా కోటి రూపాయలను ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. కోటి ఆపై కూడా పారితోషికం ఆఫర్‌ చేస్తూ పలు చిత్రాలు కైరా వద్దకు వస్తున్నాయి. అయితే కథ మరియు దర్శకుడు, హీరో నచ్చితేనే సినిమాలకు కమిట్‌ అవుతాను అంటూ కైరా అద్వానీ కండీషన్‌ పెడుతుంది. దాంతో పలు చిత్రాలను ఈమె కాదనుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రెండవ సినిమాతోనే కోటి ఆపై పారితోషికంను అందుకుంటున్న కైరా అద్వానీ భవిష్యత్తులో టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.