తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బర్మా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో తండ్రిని చంపేశాడో యువకుడు. తన తల్లితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం పరిధిలో ఈ ఘోరం జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే గోపిరెడ్డి ఈశ్వరరావు దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్ళిళ్లు జరిగాయి. అందరూ అమ్మాయిలే కావడంతో కుమార్ అనే బాబున దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇప్పుడా దత్తడి వయసు 21 ఏళ్లు. ఐతే గోపిరెడ్డి ఈశ్వరరావు నిత్యం మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులు వేధిస్తుండేవాడు. ఎంత చెప్పినా అతని ప్రవర్తనతో మార్పు లేకపోవడంతో భార్యా పిల్లలు విసిగిపోయారు. ఈ క్రమంలోనే తల్లితో కలిసి తండ్రిని ఈశ్వరరావును దారుణంగా హతమార్చాడు కుమార్. మద్యం తాగొచ్చి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఇంటి పక్కనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. ఐతే తండ్రిని తానే చంపానని ఇటీవల బాబాయితో అతడు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం అందరికీ తెలియడంతో నిందితుడు కుమార్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం కుమార్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.