Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం ఈనాటిదికాదు… అప్పటి పటౌడీ, షర్మిలా ఠాగూర్ నుంచి ఇప్పటి విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దాకా ఎందరో క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లాడారు. దేశంలో క్రికెట్, సినిమా రెండూ అత్యంత ఆకర్షణీయ రంగాలు కావడంతో పెళ్లికి ముందు వారి ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. కోహ్లీ, అనుష్క గురించి కూడా పెళ్లికి ముందు వరకూ చాలా చర్చ జరిగింది. గత ఏడాది డిసెంబర్ లో వారిద్దరూ పెళ్లిచేసుకుని… ఆ చర్చకు ముగింపు పలికారు. వారి పెళ్లి తర్వాత ఇప్పటిదాకా మళ్లీ ఏ క్రికెటర్, హీరోయిన్ పేరూ కలిసి వినిపించడం లేదేమిటా అని అందరూ అనుకుంటున్న సమయంలో… ఓ జంట వార్తల్లో నిలిచి… పుకార్లకు తెరతీసింది.
టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జంటగా కనిపించారు. ఆ ఫొటోలే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ పెదవి విప్పడం లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ ఈ ఏడాది ఐపీఎల్ లో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. మరో పక్క నిధి అగర్వాల్ తెలుగులో నాగచైతన్య సరసన సవ్వసాచిలో నటిస్తోంది.