రాజకీయాలు వేరు స్నేహబంధం వేరు అనే విషయం మరోసారి నిరూపితం అయ్యింది. చంద్రబాబును బద్ద శత్రువుగా చూసినా తెలుగుదేశాన్ని కానీ నందమూరి ఫ్యామిలీని చిన్న మాట కూడా అనేవాడు కాదు కొడాలి నాని. ఎందుకంటే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన నందమూరి కుటుంబం అంటే అంత ప్రాణం ఆయనకు. ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ఎన్టీఆర్ కు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇక హరికృష్ణ గారంటే ఆయనకు ఎనలేని అభిమానం
ఆయనే తన రాజకీయ గురువు చెప్పుకుంటారు కొడాలి. అలాంటి కొడాలి నాని తన గురువుగారి మరణ వార్త వినగానే కొడాలి కన్నీళ్లు పెట్టుకుని, హుటాహుటిన నార్కట్ పల్లి బయలుదేరి వెళ్లారు. అప్పటి నుండి ఆయన ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. ఆయన బౌతిక కాయం హైదరబాద్ తరలించినప్పటి నుండి వారి ఇంటి వద్దే ఉండి ఎన్టీఆర్ కు ధైర్యం చెబుతున్నారు. ఇంటికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ అని ఆయన చెప్పారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని బాధపడుతున్నారు.