Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ కప్ దాకా ఆడతాడా లేదా…ఆయనకు ఆడాలని ఉన్నా….ఇంకా ఏడాది కాలం పాటు జట్టులో స్థానం నిలుపుకోగలడా…? వరల్డ్ కప్ దాకా ధోనీని కొనసాగించడం మంచిదా..లేక ఆయన స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం లాభిస్తుందా..? ఇలా క్రికెట్ అభిమానుల్లో ధోనీ గురించి కొంతకాలంగా చర్చ జరగుతోంది. కొందరు ధోనీ లాంటి అనుభవజ్ఞుడు టీమిండియాకు చాలా అవసరం అని వాదిస్తుండగా..మరికొందరు మాత్రం ధోనీ జట్టుకు భారంగా మారాడని అభిప్రాయపడుతున్నారు. ధోనీ ఒక్క మ్యాచ్ లో విఫలమయినా చాలు…ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్..భారత్ కు తొలివరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ధోనీ జట్టులో ఉండ్సాలిన అవసరమేమిటో వివరంగా చెప్పాడు.
2019 ప్రపంచకప్ లో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ…మాజీ కెప్టెన్ ధోనీ కాంబినేషన్ భారత్ కు ఎంతో మేలు చేస్తుందని కపిల్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఉంటాడని, అలాంటప్పుడు మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ఆటపై పూర్తిస్థాయిలో కమాండ్ ఉన్న ధోనీ జట్టులో ఉంటే..ఆ కాంబినేషన్ భారత్ కు లాభిస్తుందన్నాడు. కోహ్లీ దూకుడు, ధోనీ ప్రశాంతత భారత్ ను విజయతీరాలకు చేరుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశాడు. అయితే మరీ ఎక్కువ దూకుడు, మరీ ఎక్కువ ప్రశాంతత కూడా జట్టుకు చెడు చేస్తుందని, జట్టులో అందరూ అగ్రెసివ్ గా ఉన్నా..అందరూ ప్రశాంతంగా ఉన్నా…జట్టుకు చేటేనని, దూకుడు, ప్రశాంతత కలయికతో జట్టు ఉండాలని కపిల్ విశ్లేషించాడు. మొత్తానికి కోహ్లీ దూకుడుగా ఉంటాడు కాబట్టి… ప్రశాంతంగా ఉండే ధోనీ భారత జట్టుకు అదనపు బలంగా మారాడన్నది కపిల్ అభిప్రాయం.