బాబోయ్‌… కత్తి మరీ పదును పెంచేస్తున్నాడు

Kona Venkat calls Mahesh Kathi a joker
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో కత్తి మహేష్‌ గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతుంది. కత్తి మహేష్‌ సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రతి స్టెప్‌ను ఆడిపోసుకుంటున్న కత్తి మహేష్‌ను తాజాగా కోన వెంకట్‌ టార్గెట్‌ చేశాడు. టాలీవుడ్‌పై కొందరు జోకర్లు కామెంట్స్‌ చేస్తున్నారు అంటూ కోన వెంకట్‌ ఇండైరెక్ట్‌గా కత్తి మహేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోన వ్యాఖ్యలు నేరుగా తాకడంతో కత్తి మహేష్‌ రెచ్చి పోయాడు. తనదైన శైలిలో కత్తి మహేష్‌ మళ్లీ పవన్‌పై వ్యాఖ్యలు చేశాడు.

కత్తి మహేష్‌ మాట్లాడుతూ… ఒక జోకర్‌ను మరో జోకర్‌, ఒక బ్రోకర్‌ను మరో బ్రోకర్‌ సమర్ధించుకోవడం చాలా కామన్‌. ఇక్కడ కోన వెంకట్‌ పరిస్థితి కూడా అదే అన్నట్లుగా కత్తి మహేష్‌ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పవన్‌కు మద్దతు అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పవన్‌ పరువు పోతుంది. ఇంకా పవన్‌ పరువు తీయవద్దని, పవన్‌ను ఏబ్రాసిని చేయద్దంటూ కత్తి మహేష్‌ అన్నాడు.

పవన్‌పై కత్తి మహేష్‌ చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి అంటూ కొందరు ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్‌పై బౌతిక దాడి జరగడం ఖాయం అని, కత్తి మహేష్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ ఏదైనా చేసే అవకాశం ఉంది అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా కత్తి మహేష్‌ మాత్రం ఏమాత్రం సందేహించకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.