అనుష్క అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌…!

Anushka Shetty And Madhavan In Kona Venkat Next

‘భాగమతి’ చిత్రం తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన అనుష్క మళ్లీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయం చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అదుగో అనుష్క, ఇదుగో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని మీడియాలో వార్తలు రావడమే కాని అధికారికంగా మాత్రం వార్తలు రాలేదు. తాజాగా ఆ విషయమై అధికారిక క్లారిటీ వచ్చేసింది. అనుష్క హీరోయిన్‌గా ఒక చిత్రం ప్రారంభం కాబోతుంది. అది తెలుగులో కావడం, ఆ సినిమాలో తమిళ హీరో మాధవన్‌ ఉండబోతుండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని మరెవ్వరు కాదు ప్రముఖ రచయిత కోన వెంకట్‌ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Anushka-Shetty-And-Madhavan

అనుష్క, మాధవన్‌ జంటగా 13 ఏళ్ల క్రితం ‘రెండు’ అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నది లేదు. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరు కలిసి సినిమా చేయబోతున్నాడు. కోన వెంకట్‌ వీరిద్దరిని కలిసి సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అప్పట్లో మంచు విష్ణుతో వస్తాడు నారాజు అంటూ చెత్త సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హేమంత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ఆ చిత్రం తర్వాత కనిపించకుండా పోయిన హేమంత్‌ మళ్లీ ఇప్పుడు అనుష్కతో సినిమాకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించబోతున్నట్లుగా కోన వెంకట్‌ అధికారికంగా ప్రకటించాడు. అనుష్క బర్త్‌డే సందర్బంగా ఈ సినిమాను ప్రకటించడంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

anuskha-shetty