పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ చేస్తున్న విమర్శలు రోజు రోజుకు శృతిమించుతూనే ఉన్నాయి. తన మనోభావాలు దెబ్బ తీసేలా పవన్ ఫ్యాన్స్ వ్యవహరిస్తున్నారు, అందుకే తాను ఇలా పవన్‌ను టార్గెట్ చేస్తున్నాను అంటూ చెబుతూ వస్తున్నాడు. పవన్‌కు మద్దతుగా సినిమా పరిశ్రమ నుండి ఎంతో మంది ఇప్పటికే కత్తి మహేష్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఇటీవలే కత్తి మహేష్‌పై కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కత్తి మహేష్‌కు లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇంకా కత్తి మహేష్‌పై కొన్ని కఠిన వ్యాఖ్యలు చేశాడు. దాంతో కత్తి మహేష్ జోకర్‌ను జోకర్, బ్రోకర్‌ను బ్రోకర్ వెనకేసుకు రావడం కామన్ అంటూ కోన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాడు.
ఆ వ్యాఖ్యలు మరింత దుమారంను రేపాయి. కత్తి మహేష్ నోరుకు హద్దు పద్దు లేకుండా పోతున్న నేపథ్యంలో కోన వెంకట్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. కోన వెంకట్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ కాస్త సైలెంట్‌గా ఉండాలని, ఈనెల 15వ తారీకు వరకు కత్తి మహేష్ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోన సూచించాడు. ఈనెల 15 వరకు అంటూ కోన డేట్‌ను చెప్పడంతో ఇప్పుడు అంతా కూడా ఆ విషయమై చర్చిస్తున్నారు. ఈనెల 15 తర్వాత ఏం జరగబోతుంది, పవన్ స్వయంగా కత్తి మహేష్ విషయమై స్పందిస్తాడా లేదా కత్తి మహేష్‌తో నేరుగా కోన వెంకట్ మాట్లాడి మద్య వర్తిత్వం చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.
ఈనెల 10న పవన్ ‘అజ్ఞాతవాసి’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సమయంలో ఎలాంటి వివాదాలు వద్దనే ఉద్దేశ్యంతో ఈనెల 15 వరకు ఆగాలని కోన వెంకట్ పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కోరి ఉంటాడు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే పవన్ కళ్యాణ్ దిగి రావాల్సిందే అని, ఎట్టి పరిస్థితుల్లో పవన్ ఫ్యాన్స్ తనను విమర్శిస్తూ ఊరుకునేది లేదు అంటూ కత్తి మహేష్ తాజాగా ఒక ఇంట్వ్యూలో చెప్పాడు. ఈనెల 15న తర్వాత జరుగబోతున్న పరిణామాలు ఏంటీ? ఆ తర్వాత ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా? కత్తి మహేష్ తన విమర్శలకు ఫుల్ స్టాప్ పెడతాడా అనేది చూడాలి.