‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’.. దద్దరిల్లిన ప్రమాణ స్వీకారం స్టేజ్..!

'Konidela Pawan Kalyan Ane Nenu'.
'Konidela Pawan Kalyan Ane Nenu'.

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ లతో పాటుగా రాజకీయాల్లో కూడా చాలా ఏళ్ల నుంచే ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక దారుణమైన ఓటమి అనంతరం పవన్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా వచ్చింది. అయితే పవన్ అభిమానుల్లో ఒక రేంజ్ ఎగ్జైట్మెంట్ నెలకొనింది.

'Konidela Pawan Kalyan Ane Nenu'.
‘Konidela Pawan Kalyan Ane Nenu’.

ప్రధానంగా “కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను” అనే మాట వినడం కోసమే అందరూ ఎంతో ఎమోషనల్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకి నేడు 11 గంటల 37 నిమిషాలకి పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం చేశారు. తన మినిస్టరీ ఏంటి అనేది తెలియపర్చలేదు కానీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో అనుకున్నట్టుగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది.

అంతే కాకుండా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేస్తున్న సమయంలో తన భార్య అనా లెజినోవా విజువల్స్ చూపించడం అలాగే ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ మోడీ, బాబు లతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ లని కలిసిన విజువల్స్ అటు ప్రత్యక్షంగా ఇటు ఆన్లైన్ లో వీక్షిస్తున్న అభిమానులు అందరూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. దీనితో ఈ లైఫ్ టైం మూమెంట్ ఫ్యాన్స్ లో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది.