Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజాగా ‘భరత్ అనే నేను’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ‘బ్రహ్మోత్సవం’, ‘సైడర్’ చిత్రాలు దారుణమైన ఫ్లాప్‌లు అవ్వడంతో మహేష్ చాలా ఢల్ అయ్యాడు. ఆ సమయంలోనే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్‌ను దక్కించుకున్న కారణంగా మళ్లీ మహేష్‌బాబు ఫామ్‌లోకి వచ్చినట్లయ్యింది. ఇక అంతకు ముందు వచ్చిన శ్రీమంతుడు సినిమా కూడా మహేష్‌బాబు కెరీర్లో కీలక సమయంలో సక్సెస్ అయ్యింది. కష్ట కాలంలో ఉన్న సమయంలో మహేష్‌బాబుకు కొరటాల రెండు సూపర్ హిట్స్‌ను ఇచ్చాడు. ఆ కారణంగానే మహేష్‌బాబు తాజాగా మాట్లాడుతూ కొరటాల తనకు రెండు సార్లు లైఫ్ ఇచ్చాడంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది.
మహేష్ బాబు వ్యాఖ్యలపై కొరటాల స్పందించాడు. ఆయన వ్యాఖ్యలను తాను స్పీకరించడం లేదని, సూపర్ స్టార్‌కు తాను లైఫ్ ఇచ్చేంత వాడిని కాదంటూ కొరటాల చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబుకు సినిమాలోని ఏ రెండు సీన్స్ కూడా సేమ్ ఉండటం ఇష్టం ఉండదు. అంతా కొత్తగా ఉండాలని, అందుకోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ద పడతాడు. అలాంటి మహేష్‌బాబు తన ప్రతి సినిమా కూడా విభిన్నంగా ఉండాలని, ప్రయోగాత్మకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమాలను ఎంచుకున్నాడు. సినిమాల ఎంపిక సమయంలో ప్రయోగాత్మకంగా ఆలోచిస్తే కొన్ని సార్లు ఫ్లాప్‌లు వస్తాయి, మహేష్‌బాబు తప్పిదం వల్ల ఆ ఫ్లాప్‌లు రాలేదని, ఆయన ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనే ఉద్దేశ్యంతో ప్రయోగాలు చేస్తే విఫలం అయ్యాయి అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మహేష్‌బాబుతో మరో సినిమాను చేస్తాను అంటూ కొరటాల శివ ప్రకటించాడు.