Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో చేసిన సినిమాలు అన్ని కూడా సక్సెస్ చేసుకున్న దర్శకులు ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. వారే రాజమౌళి, కొరటాల శివ. వీరిద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకులుగా వెలుగు వెలుగుతున్నారు. రాజమౌళి స్థాయికి కొరటాల శివ చేరుకోలేక పోవచ్చు. కాని రాజమౌళి స్థానంను దర్శకుడు కొరటాల మాత్రమే భర్తి చేయగల సమర్ధుడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్స్. అంతే కాకుండా ఆయా హీరోల కెరీర్లో టాప్ చిత్రాలుగా నిలిచాయి. దాంతో కొరటాల శివ క్రేజ్ ఆకాశాన్ని అంటింది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఆయన పారితోషికంగానే 25 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి మాత్రమే 20 కోట్ల పారితోషికాన్ని అంతకు మించి అందుకుంటున్నాడు. ఇప్పుడు కొరటాల శివ ఆ స్థాయి పారితోషికాన్ని అందుకుంటున్నాడు. త్వరలో కొరటాల శివ తెరకెక్కించబోతున్న సినిమాకు ఏకంగా 20 కోట్లకు పైగా పారితోషికం తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత వాటికి 25 కంటే ఎక్కువ ఇస్తామంటూ నిర్మాతలు క్యూ కడుతున్నారు. రాజమౌళి రేంజ్లో కొరటాల శివ కూడా పారితోషికాన్ని తీసుకుంటున్నాడు అంటే ప్రస్తుతం కొరటాల శివ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భరత్ అనే నేను టాలీవుడ్ టాప్ 3 చిత్రంగా నిలవడం ఖాయం అయ్యింది. దాంతో కొరటాల తర్వాత సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.