పవన్ దెబ్బకి వామపక్షాలు బాబు చెంతకు !

CPM and CPI parties support Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈయన వ్యవహార శైలి మొదటి నుండి భిన్నమే. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు తప్ప ఆలోచన చేయడని ఆయనకి ముందు నుండి పేరు. అధికారమే అక్కర్లేదు ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టని చెప్పి, విలువలతో కూడిన రాజకీయం మాత్రమె చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు విలువలే లేని పనులు చేస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహంలేదు. ఎందుకంటే ఎవరో నటి తన తల్లిని (అసలు దూషించింది పవన్ నే) తిడితే, దాని వెనుక నేనున్నా అని వర్మ ప్రకటించినా, తదుపరి తిట్టినామే ఇది వైసీపీ ప్లాన్ అని స్వయంగా తెలిపినా టీడీపీ మీదనే విమర్శలు చేయడం చూస్తుంటే పవన్ ఎవరి ప్రలోభాలకో లొంగాడు అనేది స్పష్టం అవుతోంది. ఈ విషయం అసలు ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వారికే అర్ధం అవుతోందంటే మొన్నటి దాకా పవన్ తో కలిసి నడవడానికి సిద్దమయిన వామపక్షాలకి కూడా అర్ధం అయ్యింది. అసలు అధికారంలోకి రామని తెలిసినా విలువల కోసం ప్రజల కోసం రాజకీయాలు చేసే వామపక్షాలు ఇప్పుడు విలువలు వదిలేసినా పవన్ వెంట నడిచేందుకు సిద్దంగా లేరట.

పవన్ చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు, ట్వీట్ లు చూస్తున్న వామపక్షాలు క్రాస్ జంక్షన్ లో నిలబడిపోయాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే నిన్న మొన్నటి దాకా అన్ని విషయాల్లోనూ పవన్ ని వెనకేసుకొచ్చిన వారు ఇప్పుడు పవన్ చేస్తున ట్వీట్ల గురించి కానీ, పవన్ చేస్తున్న వ్యాఖ్యల మీద కాని ఏమీ స్పందించడం లేదు. వారు కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అర్ధం అవుతోంది. ఈ విషయంలో పవన్ కు మద్దతు తెలిపేందుకు కానీ… ఆయనను కనీసం కలిసేందుకు కానీ వామపక్ష నాయకులు ముందుకు రాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు బీజేపీ కాంగ్రెస్ అంటేనే భగ్గుమనే వామపక్షాలు ఇప్పుడు పవన్ చేస్తున్న పనులన్నీ బీజేపీ కోసమే అని భావిస్తున్నట్టు ఉన్నాయి అందుకే పవన్ కళ్యాణ్ తో, జనసేనతో దూరం జరిగేందుకు వామపక్షాలు దాదాపుగా సిద్ధమైనట్టే అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నిన్న జరిగిన సీపీఎం జాతీయ మ‌హాస‌భ‌లలో కాంగ్రెస్‌, భాజ‌పా ఏత‌ర కూట‌మి కోసం ప్ర‌య‌త్నం మొద‌లుకావాల‌ని అందుకు శ్ర‌మిస్తామ‌ని ఏచూరి ఇచ్చిన పిలుపు కూడా పవన్ కి వారు దూరం అయి కాంగ్రెస్‌, భాజ‌పా ఏత‌ర కూట‌మి అంటే చంద్రబాబు ప్రయత్నిస్తున్న జాతీయ ఫ్రంట్ కి మద్దతు తెలిపేలా కనపడుతోంది. ఎందుకంటే సీపీఐ మొదటి నుండి కాస్త బాబుకి అండగా ఉంటుందనే చెప్పాలి, ఇక ఎటూ సీపీఎం మరలా బాబు వైపు మొగ్గు చూపితే వారి సోదర పార్టీ అయిన సీపీఎం కూడా సిపీఐ వెనుక నడుస్తుంది అనేదానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటనా లేకపోయినా నిన్న సభ లో సీతారాం ఏచూరి మాటలని బట్టి చూస్తే వీలయినంత త్వరగా వారు బాబు చేపట్టబోయే జాతీయ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.