తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. అయితే కుక్కకాటుతో సుమారు 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరికైతే కనుగుడ్డు తొలిగిపోయిన హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్కల స్వైర విహారం చేశాయి. దీంతో జనం ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకు చేశాయో ఏమో కానీ.. దొరికిన వారిని దొరికినట్లు జనాలపై పడి దాడి చేయడంతో జనాలు పరుగులు తీశారు. తీవ్రమైన భయానికి లోనయ్యారు.