Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో వలసలు సర్వసాధారణం అనుకునే స్థాయిలో వున్నాం. అయినా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ ని వీడి టీడీపీలో చేరడం మాత్రం సంచలనం అయ్యింది. జగన్ కి అండగా చంద్రబాబు మీద ఇంతెత్తున లేచే గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం తో వైసీపీ మీద కనబడని ప్రభావం పడింది. జగన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళకే అక్కడ స్థానం లేనప్పుడు ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి అన్న ఆలోచన మొదలైంది. పార్టీలో వున్న వాళ్ళే ఇలా అనుకుంటే ఇక బయట వున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
గిడ్డి ఎపిసోడ్ తర్వాత వైసీపీ వైపు చూస్తున్న ఇద్దరు సీనియర్ నాయకుల ఆలోచన మారినట్టు చెప్పుకుంటున్నారు. వారిలో ఒకరు కన్నా లక్ష్మి నారాయణ అయితే ఇంకొకరు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. కన్నా బీజేపీ లో సేఫ్ గా ఉన్నప్పటికీ ఆ జెండా, అజెండాతో ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని అర్ధం చేసుకున్నారు. బీజేపీ తో చంద్రబాబు కు గ్యాప్ సృష్టించడంలో సక్సెస్ అయిన కన్నా ఆ పరిణామంతో తన రాజకీయ భవిష్యత్ కి ఒరిగేది ఏమీ లేదని అర్ధం చేసుకున్నారు. అందుకే వైసీపీ నుంచి పదేపదే అందుతున్న ఆహ్వానాలకు టెంప్ట్ అయ్యారు. కానీ గిడ్డి ఈశ్వరి ఎపిసోడ్ తర్వాత వైసీపీ లో పెత్తనం ఎవరు, ఎలా చేస్తున్నారో తెలుసుకున్న కన్నా తన ఆలోచనను పక్కనబెట్టారట. ఇక కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సైతం ఇదే రూట్ లో వెళ్ళబోతున్నారట. కాంగ్రెస్ తో భావించిన ఆయన వైసీపీ పిలుపుతో మెత్తబడినా తాజా పరిణామాలతో ఆయన బ్యాక్ అయ్యారట. మామూలుగా అయితే జగన్ పాదయాత్ర కర్నూల్ చేరగానే ఆయన సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోవాలని సూర్య ప్రకాష్ రెడ్డి అనుకున్నారట. దానికి అనుగుణంగా జగన్ పాదయాత్ర రూట్ కూడా ఖరారు చేసారు. కోట్ల తాజా నిర్ణయంతో జగన్ పాదయాత్ర రూట్ మార్చే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తానికి గిడ్డి ఈశ్వరి ని తక్కువ అంచనా వేసిన వైసీపీ ఆమెతో పాటు మరికొందరు నేతలను కూడా పోగొట్టుకుంది.