జనాల్లోనే ఉంటా.. జనంతోనే ఉంటా.. నోటీసులిస్తారో.. అరెస్ట్ చేస్తారో చేసుకోండంటున్నారు కేటీఆర్. రాష్ట్ర పర్యటనతో హీట్ పుట్టిస్తోన్న కేటీఆర్.. రేవంత్ సర్కార్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. రాబోయే కాలమంతా బీఆర్ఎస్‌దేనంటూ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు కేటీఆర్.