Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేను సిరిసిల్ల విడిచి వెళ్లేది లేదంటున్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ మంచి స్థానం కోసం వెతుకుతున్నారన్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. కానీ జనానికి చెప్పేదొకటి… తెరవెనుక జరిగేదొకటి అని మంత్రి సన్నిహితులే లీకులిస్తున్నారట. అసలు కేటీఆర్ మంత్రిగా సిరిసిల్లకు ఏం చేశారో చూస్తే… ఆయన భావన అర్థమౌతుందని విపక్షాలు మండిపడుతున్నాయి.
సిరిసిల్ల నేత కార్మికులకు అది చేస్తాం… ఇది చేస్తామని చెప్పడమే కానీ… ఇప్పటివరకూ కేటీఆర్ వల్ల సిరిసిల్లలో వచ్చిన మార్పులేంటని జనం ప్రశ్నిస్తున్నారు. అందుకే అందరి ప్రశ్నలకు జవాబులో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అంటూ పెద్ద పుస్తకం అచ్చేశారు కేటీఆర్. కానీ ఇందులో చేసినవే ఉన్నాయా… చేయని పనులు కూడా పనిలోపనిగా రాసేశారా అనే అనుమానాలు వస్తున్నాయి.
అవి ఇస్తాం… ఇవి ఇస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్న కేటీఆర్… ప్రభుత్వ శాఖల తరపున నేత కార్మికులకు ఆర్డర్లు ఇప్పిస్తే… ఏ బ్రాండ్ అంబాసిడర్ల సాయం లేకుండానే తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతాయని, చేతిలో ఉన్న పని చేయకుండా తాము నేసిన చీరలు విదేశాలకు పంపించి అమ్మిస్తానంటే నమ్మకం కలగడం లేదట సిరిసిల్ల నేతన్నలకు. మరి 2019లో సిరిసిల్లకు ఫిక్సౌతానంటున్న కేటీఆర్ మాటల్లో నిజమెంతో త్వరలోనే తెలిసిపోతుంది.