HCU భూముల వెనుక 10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందన్నారు మాజీ మంత్రి KTR. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక బీజేపీ ఎంపీ సపోర్ట్‌తో రేవంత్ రెడ్డి.. HCU భూముల కుంభకోణానికి తెరతీశారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన అంటేనే.. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడమనే త్రీడీ విధానంతో పేదల బతుకులను కాంగ్రెస్ నాశనం చేస్తోందని మండిపడ్డారు.