ఈసారి ఏపీలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని ప్రధానమంత్రి అభ్యర్థిని తానే నిర్ణయించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 9 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఫైనలైజ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లో కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నంద్యాల నుంచి ఎస్‌పీవై రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో్వైపు ఆ జిల్లాలో ఉన్న14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అందులో పత్తికొండ నుంచి కేఈ శ్యామ్, డోన్ నుంచి కేఈ ప్రతాప్, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కర్నూలు నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వరరెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్ధన్‌రెడ్డి పేర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఆదోని, కోడుమూరు, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం చంద్రబాబు జిల్లా నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది.