ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ చాలా తీవ్రంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కేసుల సంఖ్య అసలు ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం కూడా ఉంది. ర్యాపిడ్ పరీక్షలు వేగవంతగా ఎక్కవగా చేస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో 24 గంటల్లో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అన్నీ కలిపి మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరింది. అలాగే… రాష్ట్రం మొత్తంలో 31 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు. కరోనా వ్యాప్తికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ.
తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. అయితే ఈ కేసుల విషయంలో కర్నూలు జిల్లా చాలా వేగంగా దూసుకుపోతుంది. ముదు వరుసలో అదే ఉంది. అక్కడే ఇప్పటివరకు అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే తాజాగా ఓ సంచలన విషయం బయటపడింది. అదేమిటంటే.. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు తెలిపారు.
వైసీపీ ఎంపీకి ఇద్దరు సోదరులు ఉండగా.. వారికి వారి సతీమణులు, ఒక పిల్లవాడికి, 83 ఏళ్ల ఎంపీ తండ్రికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే తండ్రి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని ఎపీ తెలిపారు.కాగా ఈ కరోనా సోకిన ఆరుగురిలో నలుగురు వైద్యులే. తన కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న ఎంపీ అందరూ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ లాక్డౌన్ అంతగా ఉపయోగపడటం లేదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. కరోనా సోకుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.