ఓ కేవీపీ ఎక్కడికెళ్లావ్?

KVP doesn't protest over Ap Budget in Parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ కి అధికారం వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకుని కింది స్థాయి కార్యకర్త దాకా అంతా చెబుతూనే వున్నారు. ఈ విషయంలో రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చేస్తున్న హడావిడి చూస్తుంటే నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందేమో అన్న ఆశ కలుగుతోంది. అయితే ఈరోజు పార్లమెంట్ వేదికగా టీడీపీ పెద్ద ఎత్తున, వైసీపీ నామమాత్రంగా ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. వైసీపీ ని కాదనుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వాడుకుని ఎందుకు ఆంధ్రప్రదేశ్ తరపున గొంతు వినిపించడం లేదో అని. ఇక కేవీపీ కూడా మౌనంగా ఉండటం ఇంకా ఆశ్చర్యకరం.

ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా జరుగుతున్న ఆందోళనలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పాల్గొంటే ప్రత్యేక హోదా సహా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విభజన సమస్యల పరిష్కారానికి ఓ దారి దొరికే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ కి కూడా ఏపీ లో తన వాదన వినిపించే అవకాశం దక్కుతుంది. ఈ విషయం రాజకీయాల్ని కాచి వడపోసిన కేవీపీ కి ఇంకొకరు చెప్పక్కర్లేదు. అంది వచ్చిన అవకాశం వదులుకుంటున్నారంటే మిగిలిన పార్టీల లాగానే ప్రత్యేక హోదా అంశంలో కేవీపీ , కాంగ్రెస్ లది కూడా ఓ నాటకం అనుకోవాల్సి ఉంటుంది. లేదా కేవీపీ ఉద్దేశపూర్వకంగా వైసీపీ అధినేత జగన్ కి మేలు చేయడానికి సొంత పార్టీ అధిష్టానాన్ని తప్పు దారి పట్టింస్తుండవచు. వీటిలో ఏదో ఒకటి నిజం కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో కేవీపీ ఎక్కడికెళ్లావ్ అని ప్రశ్నించకుండానే ఆయన పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ తరపున జరుగుతున్న పోరాటంలో భాగం అయి వుండేవాళ్ళు.