ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. ఆగస్టులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 54% తక్కువ వర్షపాతం నమోదయింది. 15 జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపించింది. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఆగస్టు నెలఖరుకు 85.97 లక్షల ఎకరాలకు గాను 51.27 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. సాధారణం కంటే 34.70 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.
గత ఖరీఫ్ లో ఆగస్టు నాటికి నమోదైన విస్తీర్ణంతో పోలిస్తే 17 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది. ఇది ఇలా ఉండగా, APలో 2 MPP, 3 MPP ఉపాధ్యక్షులు, 186 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 4న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ATP జిల్లా పెదపప్పురు, YSR జిల్లా లింగాలలో MPP, సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లి, అన్నమయ్య జిల్లా గాలివీడు, AKP జిల్లా S.రాయవరంలో MPP ఉపాధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిషత్ కో-ఆప్షన్, వివిధ జిల్లాల్లో మరో 186 వార్డు సభ్యుల స్థానాలకు సెప్టెంబర్ 4న ఎన్నికలు నిర్వహిస్తారు.