బాసర ట్రిపుల్‌ ఐటీకి మహిళా ఎస్‌ఐ నియామకం

lady si basara iiit

విద్యార్థినులను అధ్యాపకుడు రవి వరాల వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు ప్రత్యేకంగా మహిళా ఎస్‌ఐని నియమిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఉదయం బాసర ట్రిపుల్‌ ఐటీని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపట్నుంచే మహిళా ఎస్‌ఐ విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులు మనోధైర్యం, ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు ఎలా పంపుతారంటూ అవుట్‌ గేట్‌ సెక్యూరిటీగార్డులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.