Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి.. నంద్యాల ఉపఎన్నికపై సర్వే చేయించారట. గెలుపు జగన్ దే నని తేల్చిచెబుతున్నారట. అని సాక్షి లాంటి కొన్ని ఛానెళ్లు పరోక్షంగా ఊధరగొడుతున్నాయి. అయితే ఈ వాదనలో నిజమెంతో లగడపాటి నోరు తెరిస్తేనే అర్థమవుతోంది. టీడీపీలో చేరాలని భావిస్తున్న లగడపాటి ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నారని ఓ వాదన బయల్దేరింది.
అయితే లగడపాటి మాత్రం ఈ వాదన అబద్ధమని సన్నిహితుల దగ్గర ఖండించారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి తిరుగులేదని, జనగ్ కు క్రెడిబులిటీ లేదని చెప్పారట. నంద్యాలలో గెలుపోటములపై తాను కామెంట్ చేయనని, కానీ జగన్ సమీప భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్సే లేదని కుండబద్దలు కొట్టారట.
జగన్ ఉద్దేశపూర్వకంగా తన వర్గం మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నారని, నిజంగా దమ్ముంటే నంద్యాలలో గెలిపి చూపించాలని టీడీపీ సవాల్ చేస్తోంది. శిల్పా మోహన్ రెడ్డిపై వ్యతిరేకత, భూమా నాగిరెడ్డి మరణంపై సానుభూతి ఉన్నాయని, శిల్పాకు అంత అనుకూలత ఉంటే బాబు ఆయనకే టికెట్ ఇచ్చి ఉండేవారనే వాదనా ఉంది. దీనికి మాత్రం జగన్ దగ్గర ఆన్సర్ లేదు.