కర్ణాటకలో బీజేపీ గెలుపు వెనుక లగడపాటి ?

sefalagist survey says bjp will win from govt in karnataka

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయిపోయిందా ? 2014లో మోడీ ప్రధాని పీటం ఎక్కిన నాటి నుండి 12 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వోడిపోయిన కాంగ్రెస్ ఈసారి కర్ణాటక ఎన్నికల్లో కూడా తమ అధికారాన్ని చేజార్చుకోనుందా ? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా ? అంటే అవుననే సమాధానం చెబుతోంది తెలుగు మీడియాలోని ఒక ప్రముఖ పత్రిక. ఇప్పటి వరకు తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరు తెచ్చుకున్న సదరు పత్రిక ఇప్పుడు కర్నాటక ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ ను బీజేపీ చావు దెబ్బ కొట్టనుంది అంటూ ఒక సర్వే ఫలితాలని విశ్లేషించింది.

సదరు కధనం ప్రకారం కర్ణాటకలో బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలినట్లు, బీజేపీకి 110-120 సీట్లు, కాంగ్రె్‌సకు 70-80 సీట్లు, జనతాదళ్‌ (ఎస్‌)కు 40 సీట్ల వరకు వస్తాయని సర్వేలో తేలినట్లు తెలిపింది. అంతే కాక మొత్తం 224 సీట్లలో బీజేపీకి సొంతంగా 112పైగా సీట్లు వచ్చి.. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదని సర్వేలో తేలినట్లు కధనం. అలాగే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఒకటి రెండు సీట్లు తక్కువ పడినా స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలినట్లు కధనం. అయితే ఇక్కడ మాత్రం సర్వే ఎవరు చేసిందో చెప్పకుండా, ఒక సెఫాలజిస్టు,ఒక రాజకీయ నేత కలిసి చేసిన సర్వే అని, దీనికి చాలా వాల్యూ ఉందని చెప్పడం గమనార్హం.

సర్వేలు జరిపే ఆ రాజకీయ నాయకుడు ఎవరా అని ఆరా తీస్తే అలా చేసేది ఒక్క లగడపాటి మాత్రమె అని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికయినా యిట్టే అర్ధం అయిపోతుంది, కానీ ఈ విషయాన్ని కధనంలో ఎక్కడా అధికారికంగా దృవీకరించలేదు. ఇన్నాళ్లు హంగు వస్తుందని.. ఎవరికి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాదు.. అధికారంలోకి రావాలంటే జేడీఎస్‌ మద్దతు కావాల్సిందే అని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. కాని లగడపాటి చేయించిన సర్వే ప్రకారం మాత్రం హంగు రాదని అర్ధం అవుతోంది. బీజేపీనే అధికారం దక్కించుకుంటుందని సర్వే కుండ బద్దలు కొట్టేసింది. అయితే ఈ విషయాలు ఆయన అధికారికంగా బయటపెట్టలేదు. ఆయన అంతర్గత బృందంతో మాత్రమే ఇవి పంచుకున్నారు. ఆ విషయాలని ఎవరో సదరు పత్రికకి చిన్న లీక్ ఇవ్వడంతో లగడపాటి పేరు వాడకుండా వారు ఒక కధనాన్ని ప్రచురించేశారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం చేసినా, కాంగ్రెస్‌ నుంచే ఆయన ప్రస్తానం ప్రారంభమవడం, ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు సర్వే విషయాలు మరింత దెబ్బతీస్తాయని గోప్యత పాటిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి, రెండు, మూడు వారాల కిందటి వరకు అధికారానికి చేరువ లోకి వచ్చే అవకాశాలు కాంగ్రె్‌సకు ఉన్నాయని, ఇటీవలి కాలంలో ఆ పార్టీ దెబ్బతినడం ప్రారంభించిందని సర్వేలో స్పష్టమైనట్లు సమాచారం. వారం కిందటి వరకూ హంగ్‌ వస్తుందని తామూ భావించామని, కానీ, ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని సర్వే బృందం తేల్చింది. అతి తక్కువ ఓట్ల తేడాతో చాలా సీట్లు కాంగ్రెస్‌ కోల్పోతుందని, ఆ స్థానాలే ఇప్పుడు ఆ పార్టీకి చేటు చేస్తున్నాయని చెప్పారు. కనీసం 2, 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్‌ పలు సీట్లలో ఓడిపోయే అవకాశాలున్నాయని వివరించింది. అలాగే ఆ మార్పు మోడీ రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టిన నాటి నుండే మొదలయ్యిందని సదరు సర్వే తెలుపుతోంది. అయితే ఇప్పటి వరకు లగడపాటి సర్వేలకి మంచి పేరుంది. ఇప్పుడు కూడా బీజేపీదే గెలుపు అని లగడపాటి సర్వే తేల్చేయడంతో ఇక అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది 15వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.