ఎన్టీఆర్ బయోపిక్ మీద లక్ష్మీపార్వతి రాజీ ?

Lakshmi-Parvathi-compromise

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏమైందో ఏమో …ఎన్టీఆర్ జీవిత చరిత్ర చుట్టూ అల్లుకున్న కథలతో మూడు సినిమాలు మూడు కోణాల్లో వస్తాయి అనుకుంటే సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క సినిమా మాత్రమే పైప్ లైన్ లో కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో చేస్తున్న ఎన్టీఆర్ సినిమా మినహా మిగిలిన రెండు సినిమాల ఊసు వినపడకుండా పోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎన్టీఆర్ జీవితాన్ని లక్ష్మీపార్వతి కోణం నుంచి చూపిస్తా అని అప్పట్లో ప్రకటించిన వర్మ ఇప్పుడు ఆ మాటే గుర్తు లేనట్టు సైలెంట్ అయిపోయారు. ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ కి పోటీగా చెన్నై నుంచి వచ్చిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి “ లక్ష్మీస్ వీరగ్రంధం “ తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.