టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ సినిమా “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ భారీ మూవీ పై మంచి అంచనాలు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి పవర్ఫుల్ లైనప్ ఉండగా వాటిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో క్రేజీ యాక్షన్ డ్రామా కూడా ఒకటి.
మరి ఈ మూవీ అనౌన్స్ చేయడంతోనే భారీ హైప్ ను అందుకోగా ఇపుడు ఈ మూవీ విషయంలో ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ అయ్యాయి. ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తాము ఈ మూవీ ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే ప్రస్తుతానికి కొన్ని రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేల్చేసారు. అలాగే ఇంకా స్క్రిప్ట్ పూర్తి అయ్యే పనిలో ఉందని తెలిపారు. అయితే సంగీత దర్శకునిగా అనిరుద్ పై కూడా హింట్ ఇచ్చేసారు . మరి వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది