“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2” పై తాజా అప్డేట్.!

Latest Update on “Gangs of Godavari 2”!
Latest Update on “Gangs of Godavari 2”!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అలాగే అంజలి లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన లేటెస్ట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. మరి రీసెంట్ టైం లో అయితే ఈ మూవీ కే సాలిడ్ బజ్ నెలకొనగా ఈ మూవీ కి మంచి ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో విశ్వక్ అలాగే నిర్మాత నాగవంశీ ఇద్దరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని అందించారు.

Latest Update on “Gangs of Godavari 2”!
Latest Update on “Gangs of Godavari 2”!

అలా విశ్వక్ ఈ మూవీ కి పార్ట్ 2 కోసం ఓపెన్ అయ్యాడు. ఈ మూవీ కి పార్ట్ 2 ఉందని అందులో కూడా తానే హీరో అంటూ చమత్కరించాడు. దీనితో అయితే ఈ మూవీ కి సీక్వెల్ కూడా ఇప్పుడు ఉందని కన్ఫర్మ్ అయ్యిపోయిందని చెప్పాలి. ఇక ఈ మూవీ లో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ ను చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు కూడా నిర్మాణం వహించారు. మరి రేపు ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .