నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కల్కి మూవీ ని మొదట మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఐతే, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ నెలలో రిలీజ్ అనుకున్నారు. అది కూడా అసలు కుదరలేదు. ఇప్పుడు, తాజాగా మరో రిలీజ్ డేట్ వినిపిస్తుంది . తాజా అప్ డేట్ ప్రకారం, జూలై 2వ వారంలో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. శ్రీరామ నవమి రోజున అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.
కాగా ఈ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే,ఈ భారీ-బడ్జెట్ మూవీ లో కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా మూవీ గా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.