“పుష్ప 2” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ..!

Latest update on the shooting of “Pushpa 2” ..!
Latest update on the shooting of “Pushpa 2” ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీ తో దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ లో తన నటనకు గానూ బన్నీ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ మూవీ కు సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది . స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ మూవీ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.

Latest update on the shooting of “Pushpa 2” ..!
Latest update on the shooting of “Pushpa 2” ..!

అయితే రేపటి నుండి ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బన్నీ త్వరలో షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.