లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “అందాల రాక్షసి” మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ అమ్మాయి మెగా ఇంటి కోడలు కాబోతోంది. ఇక మెగా ఇంటి కోడలు అయింది కాబట్టి చాలా సాంప్రదాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎన్నో మూవీ లలో నటించి తన అందాలను ప్రదర్శించింది.
కానీ ఇప్పుడు అలా చేయడం సరికాదని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను మెగా ఇంటి కోడలు కాబట్టి తాను ఏం చేసినా మెగా కుటుంబాన్ని, మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగానే లావణ్య కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ కి ముందు ఒప్పుకున్న సినిమాలను కూడా వదులుకున్నారు. తమిళ్ లో ఓ వెబ్ సిరీస్ ను చేసేందుకు లావణ్య త్రిపాఠి ఓకే చెప్పిందట. ఇక మరికొన్ని రోజుల్లో వీరి వివాహం జరగబోతోంది.
అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందట . ఇక లావణ్య ఈ వెబ్ సిరీస్ కి నో చెప్పిందట. ఎందుకంటే ఇందులో కథానాయిక పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందని, అంతేకాకుండా రొ**మాన్స్ సీన్స్ కూడా ఉండడంతో లావణ్య త్రిపాఠి దర్శక నిర్మాతలను ఇంటికి పిలిపించి మరొక హీరోయిన్ ను చూసుకోమని చెప్పిందట. అంతేకాకుండా ఈ సిరీస్ కోసం ఆమె తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేసిందట. ఏదిఏమైనప్పటికే లావణ్య త్రిపాఠి చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.