పేరు మారింది.. పంచాయితీ మొదలయింది..

YS Jagan
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో పేర్లమార్పు వివాదం మరోసారి రాజకీయరచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా..వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది..ఏపీ కేబినెట్‌. ఇప్పుడు తాజాగా విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో..వైఎస్‌ఆర్‌ పేరు మాయమయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు..