తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది ఏమో కానీ…. ఎరుపు పలుచ బడదు అది ఎప్పటికి కాషాయం కాదు అన్న మాటలు ఆంధ్రప్రదేష్ రాజకీయాల వరకు మాత్రం నిజం కాదేమో … లెఫ్టిస్ట్ లు , కమలనాథులు ఇద్ధరూ కుడా ముదిరిన తొండలే..
పైకి మాత్రం మనం మనం కొట్టుకుందాం , లోపల అధికారం కోసం కుమ్మక్కు అవుదాం … పార్టీలకంటూ సిద్ధాంతాలు ఏవి లేవు , అధికారమే పరమావధి …కేంద్రం లో కమలనాథులు , రాష్ట్రం లో లెఫ్టిస్ట్ లు పవన్ కి మద్దతు ఇస్తారు … భిన్న దృవాలు, భిన్న సిద్ధాంతాలు..
రాజకీయం లో ఇజాలు , నిజాలు ఏవి అవసరం లేదు .. సిద్ధాంతం తో అసలు పని లేదు , కుర్చీ ఒక్కటే అంతిమ లక్ష్యం .
అందుకే పవన్ కమలాన్ని గుండెల్లో , ఎరుపు కండువా ని భుజం పై మోస్తున్నాడు … ఏకాదశి ఉపవాసం ఆస్తికుడిని అని ఒక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు …. చేగువేరా, మార్క్స్ నాకు ఆదర్శం అనే ఇంకో వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు … అవసరానికి ఆదర్శాలు వల్లే వేయడమేనా ?? నిజం గా సిద్ధాంత పరమైన అవగాహన పార్టీ లకు గానీ , వ్యక్తులకు గానీ ఉన్నాయా??