విశ్వమంతా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. దీంతో మనుషులకే కాకుండా జంతుజాలమైన పశుపక్ష్యాదులకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అసలు లాక్ డౌన్ ప్రభావం మనుషుల కంటే జంతువులపైనే ఎక్కువగా పడింది. ప్రపంచ వ్యాప్తంగా వీధి కుక్కలు, పిల్లులు ఇతర జంతువులకు తిండి కరువైంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫంక్షన్స్ బంద్ కావడంతో ఎక్కడా తిండి దొరక్క కుక్కలు, పిల్లులు వంటి చరాచర జీవులు అలమటించిపోతున్నాయి. రోజు ఫుడ్ దొరికే స్పాట్ లకు వెళ్లి అక్కడ ఏమీ దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు లోనౌతున్నాయి.
ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళనకు లోనౌతున్నారు. లాక్ డౌన్ కోట్లాది జంతువులకు డెత్ సెంటన్స్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీస్, యూరోప్, టర్కీ వంటి దేశాల్లో జంతువులకు ఆహారం అందించేందుకు అక్కడి అధికారులు దృష్టి పెట్టారు. ‘ మేము ఫీడ్ వేస్తున్న చోటికి వందలాది పిల్లలు వస్తున్నాయి. కొన్ని రోజు ఫుడ్ దొరికే ప్లేస్ కు వెళ్లి దీనంగా చూస్తున్నాయి’ అంటూ గ్రీస్ లోని నైన్ లైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కార్డెలియో మాడెన్ వెల్లడించారు కూడా.
అదేవిధంగా ఆకలితో వీధి కుక్కలు క్రూరంగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుందని కూడా వైద్యులు ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రీక్ అధికారులు జంతువులకు ఆహార వ్యవహారాలు అందిచేందుకు ఆన్ లైన్ ద్వారా జనాన్ని కోరుతున్నప్పటికీ ఏమంత స్పందన రావటం లేదని వెల్లడిస్తున్నారు. దీంతో యానిమల్ వెల్పేర్ సోసైటీలే వాటికి ఫుడ్ అందించేందుకు 350 మంది వాలంటీర్లతో ఏర్పాట్లు చేస్తున్నాయి.
కాగా ఇండియాలో కూడా లాక్ డౌన్ వేళ మూగజీవాలకు తినేందుకు ఆహారం దొరకని పరిస్తితి నెలకొంది. సాధారణ పరిస్థితుల్లో అక్కడ జనావాసాల్లో కనిపించే కోతులు.. ఓ వైపు వేసవి కాలం అవడం, మరోవైపు లాక్ డౌన్ అఫెక్ట్ తో పశుపక్ష్యాదులు విలవిలలాడిపోతున్నాయి. వాటికి ఆహార పదార్థాలు దొరక్క బిక్కుబిక్కమంటూ కాలమెళ్లబుచ్చుచున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మైగల్ గంజ్ ప్రాంతంలో ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆకలితో అలమటిస్తున్న కోతులకు ఆహారం అందించారు. ఆహారధాన్యాలు, పండ్లు, ఫలాలు కోతులకు అందించి మూగజీవాల పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు. కోతుల మంద ఎగబడి మరీ ఆహారం తింటున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదో వెరైటీగా జనాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.