కుల అహంకారానికి మరొకరు బలయ్యారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్, సాయి దీపికలు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన సాయిదీపిక కుటుంబ సభ్యులు గొల్ల సామాజికి వర్గానికి చెందిన గడ్డి కుమార్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్నదీపిక కుటుంబసభ్యులు దీపికను మరిచిపోవాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో తాడికల్ – వంకాయగూడెం గ్రామాల సరిహద్దులోని పత్తి చేనులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడిని యువతి తరపు బంధువులు హత్య చేశారని గ్రామస్థులు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు, బంధువులు పోలీస్ జీపు అద్దాలు ధ్వంసం చేశారు. హత్యను నిరసిస్తూ కరీంనగర్-వరంగల్ జాతీయ రాహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హుజూరాబాద్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలిసిన ఏసీపీ కృపాకర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని ఏసీపీ కృపాకర్ నచ్చచెప్పడంతో కుమార్ కుటుంబీకులు శాంతించారు.