అరవింద సమేత వీర రాఘవ సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్…!

Jr NTR Aravinda Sametha Gets U/A Certificate

అరవింద సమేత సినిమా భారీ అంచనాలతో విడుడా అవడానికి సిద్ధం అవుతుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతుండగా దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. విడుదలకు కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి రావడం తో అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతోంది. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూసి సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో ఎక్కువగా రక్తంతో కూడిన వయోలెన్స్ సన్నివేశాలు ఉండడం తో క్లిన్ యూ రాలేదని తెలుస్తుంది. U/A సర్టిఫికెట్ రాగా సినిమా టోటల్ రన్ టైం సుమారు 2 గంటల 42 నిమిషాలుగా కన్ఫాం అయింది…ఇక సెన్సార్ వారి నుండి సినిమా కి వస్తున్న టాక్ కూడా అద్బుతంగా ఉందని చెప్పొచ్చు.

ntr-movies
ఇక సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమా ఓ రేంజ్ లో ఉందని , ఎన్టీఆర్ నటన విశ్వరూపం చూడబోతున్నారని , ఇప్పటివరకు చూసిన త్రివిక్రమ్ వేరు ఈ సినిమాలో చూసిన త్రివిక్రమ్ వేరు అనేలా ఉందని , అసలు సిసలైన యాక్షన్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడని అన్నారట. ఇక సినిమాలో నటించిన నటీనటులంతా ఎంతో బాగా నటించారు అనడం కన్నా జీవించారని చెప్పాలని సెన్సార్ సభ్యులు చెపుతుండడం సినిమా ఏ స్థాయి లో ఉందొ అర్ధం అవుతుంది. అలాగే ఇంటర్వెల్ కి ముందు నుండి అసలు సినిమా మొదలు అవుతుందని అంటున్నారు, ఓ హై ఒల్టేజ్ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ ముగిసిన తర్వాత సెకెండ్ ఆఫ్ సినిమాకి అసలు సిసలు ప్రాణం పోస్తుందని అంటున్నారు.

aravindha-sametha

అనుకోకుండా ఒక యుద్ధం చేసే హీరో ఆ యుద్ధం ముగిశాక ఎలాంటి పరిస్థితులను ఎదురుకొన్నాడు, మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది స్టోరీ లైన్ గా చెబుతున్నారు. రాధాకృష్ణ నిర్మాణ విలువలు , థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నట్లు చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా సెన్సార్ నుండి మరింత పాజిటివ్ టాక్ రావడం తో అభిమానుల గాల్లో తేలిపోతున్నారు.